సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా.. త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పవన్ చేస్తున్న కామెంట్స్ సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలం వరకు బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా పూర్తిగా రూట్ మార్చేశారు. బీజేపీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం తిరుపతిలో హాట్ హాట్ కామెంట్స్ చేశారు పవన్.
బీజేపీకి తాను దూరం కాలేదని..వారితో విబేధించానన్నారు పవన్. ప్రత్యేక హోదా అంశంలోనే బీజేపీతో విబేధించడం జరిగిందని వివరించారు. వైసీపీకి అమిత్ షా అంటే భయం..తనకు మాత్రం ఆయనంట గౌరవమన్నారు. బీజేపీ – టీడీపీతో తాను కలిసి ఉంటే..గత ఎన్నికల ఫలితలు మరోలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి తనకు చాలాసార్లు ఆహ్వానం అందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైసీపీ నేతలు తనకు నమస్కారాలు పెట్టాలని అన్నారు పవన్ కళ్యాణ్.
> ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు పవన్. అప్పటి నుంచి ఆయన స్వరం మారింది. ఉన్నట్లుండి అమిత్ షా పేరును ప్రస్తావిస్తున్నారు.
> ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ చర్చించారని, అందుకే ఇప్పుడు వాళ్ల గురించి టాపిక్ తెస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
> నిత్యం పదునైన మాటలతో వైసీపీని విమర్శులు చేస్తున్నారు.
> రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్..చేస్తున్న కామెంట్స్ మరింత హీట్ పెంచాయి.
> ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయాలకు మోదీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారంటూ పవన్ కామెంట్ చేశారు.
> జనసేన ఒంటరిగానే ఉంటుందా ? బీజేపీతో దోస్తి కడుతుందా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
Read More : విలీనం మంట : రూట్ మార్చిన పవన్..బీజేపీపై పొగడ్తలు