Pawan Kalyan: పాక్, బంగ్లా పేర్లు ప్రస్తావిస్తూ దీపావళి సందర్భంగా పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. ఆ వీడియోలో ఏముందంటే..?

దీపావళి పర్వదినం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Pawan Kalyan

Pawan Kalyan: దీపావళి పర్వదినం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. భారత్ – పాక్ విభజనకు సంబంధించి బాధతో ఓ బాలుడు పాడిన పాట ఈ వీడియోలోఉంది. ఈ చిన్నారి పాడిన పాటలో దేశ విభజన కారణంగా కలిగిన బాధ స్పష్టంగా కనిపించిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read: US Election 2024: ’చెత్త‘ ట్రక్కును నడుపుతూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ట్రంప్.. వీడియో వైరల్

పవన్ తన ట్వీట్ లో పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు. ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మీ భద్రత, స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతిఒక్కరం ఎరుచూస్తున్నాం.  పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత, వారికి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం, ప్రపంచ నేతలు కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నా.. వారికోసం మనమంతా ప్రార్ధిద్దాం అని పవన్ పేర్కొన్నారు. అయితే, పవన్ కల్యాణ్ ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ట్వీట్ కు నెటిజన్లు స్పందిస్తూ మద్దతు తెలుపుతున్నారు.