Chelluboina Venugopala Krishna : కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు- పవన్ కల్యాణ్‌పై మంత్రి వేణు ఫైర్

Chelluboina Venugopala Krishna : పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాలలో అశాంతిని నెలకొల్పుతున్నారని మండిపడ్డారు.

Chelluboina Srinivasa Venugopala Krishna (Photo : Twitter, Google)

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు ఎదురుదాడికి దిగారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిస్తున్నారు. పవన్ కల్యాణే పెద్ద రౌడీ, గూండా అంటూ విరుచుకుపడుతున్నారు. జనసేన పార్టీ రౌడీల పార్టీ అంటూ ధ్వజమెత్తుతున్నారు.

తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు.. జనసేనాని పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. పదే పదే కులం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అని పవన్ ను ప్రశ్నించారు. సమ సమాజం కోసం మాట్లాడే తీరు ఇదేనా? అని పవన్ ను నిలదీశారు. పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాలలో అశాంతిని నెలకొల్పుతున్నారని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు.

Also Read..Eluru Constituency: ఏలూరులో వైసీపీ టికెట్ ఆయనకేనా.. జనసేనకు ఏలూరు పట్టం కడుతుందా.. టీడీపీ పరిస్థితేంటి?

జనసేన పార్టీలోకి వచ్చి పోయిన వారి సంగతి ఏంటో పవన్ చెప్పాలన్నారు. 2019లో మీరు చేసిన ప్రయత్నం ప్రజాభిమానం పొందలేదన్నారు. కాకినాడ వచ్చి పదే పదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి పవన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ద్వారంపూడి ఛాలెంజ్ ను పవన్ కల్యాణ్ స్వీకరించాలన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, సమాజంలో సముచిత స్థానం కలిగిన వ్యక్తి అని మంత్రి వేణు చెప్పారు. పవన్ కల్యాణ్.. వారాహిని నారాహిగా మార్చారని విమర్శలు చేశారు. 2018లో తనకు ప్రాణహాని ఉందని పవన్ చెప్పారని మంత్రి వేణు గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి ప్రాణహాని ఉందంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.