Pawan Kalyan: జనసేన పోటీచేసే మరో 5 స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టతనిచ్చారు.

Pawan Kalyan

ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు. ఇవాళ మరో ఐదు స్థానాలపై పవన్ క్లారిటీ ఇచ్చారు.

భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయంపై స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఆయన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురిపై క్లారిటీ ఇవ్వడంతో మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై స్పష్టత ఇచ్చినట్లయింది.

5 స్థానాల్లో ఎవరెవరు?

  • భీమవరం – రామాంజనేయులు
  • రాజోలు – వర ప్రసాద్
  • నరసాపురం – బొమ్మిడి నాయకర్
  • ఉంగుటూరు – ధర్మరాజు
  • తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న విషయంపై సంయుక్త ప్రకటన చేశాయి.

 Also Read: గాజువాకలో వైసీపీ జెండా ఎగరేస్తాం- మంత్రి గుడివాడ అమర్నాథ్