Gudivada Amarnath : గాజువాకలో వైసీపీ జెండా ఎగరేస్తాం- మంత్రి గుడివాడ అమర్నాథ్
గాజువాక నియోజకవర్గం నేను పుట్టి, పెరిగిన ప్రాంతం అని తెలిపారాయన. గాజువాక నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.

Gudivada Amarnath
Gudivada Amarnath : గాజువాకలో వైసీపీ జెండా ఎగరేస్తాం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. మా తాత, తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుండే పోటీ చేసే అవకాశం సీఎం జగన్ తనకు కల్పించారని అమర్నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. గాజువాక నియోజకవర్గం నేను పుట్టి, పెరిగిన ప్రాంతం అని తెలిపారాయన. గాజువాక నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వరికూటి చందును కలుపుకుని ముందుకు వెళతానన్నారు గుడివాడ అమర్నాథ్. నాగిరెడ్డి, చందు మా కుటుంబ సభ్యులు అని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ముందు నుండి వ్యతిరేకమే అని ఆయన స్పష్టం చేశారు. గాజువాకలో అన్ని సామాజికవర్గాలు తనకు సహకరించనున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బెర్త్ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రి స్వస్థలం గాజువాక నుంచి అసెంబ్లీ టికెట్ ను కన్ ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై సందేహాలన్నీ తొలగిపోయాయి. సీటు ప్రకటన తర్వాత గాజువాక చేరుకున్న మంత్రి గుడివాడకు ఘన స్వాగతం పలికాయి పార్టీ శ్రేణులు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై ఇటీవలి కాలంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే, తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ అమర్నాథ్ పొలిటికల్ కెరియర్ కు లైన్ క్లియర్ అయ్యినట్లు అయ్యింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అగ్రనాయకత్వం.
Also Read : టీడీపీ రెండో జాబితా సిద్ధం.. గురువారం ప్రకటిస్తాం: చంద్రబాబు