Pawan Kalyan : రేపు రాజమండ్రికి పవన్ కల్యాణ్ .. రైతన్నలకు పరామర్శ, పోలవరం ప్రాజెక్టు సందర్శన

జనసేనాని పవన్ కల్యాణ్ రైతన్నల కోసం తన బిజి బిజీ షూటింగ్ లను పక్కన పెట్టి వర్షాలకు దెబ్బతిన్న రైతులను పరామర్శించనున్నారు. రైతుల కష్టసుఖాలు తెలుసుకోవటానికి వెళ్లనున్నారు.

Pawan Kalyan : జనసేనాని (Janasena Party) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari district)లో పర్యటించనున్నారు.రాజమండ్రిలో పర్యటించి అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పరామర్శించనున్నారు. దీని కోసం పవన్ పవన్ బుధవారం (మే 9,2023) ఉదయం రాజమండ్రి చేరుకుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని మోచ తుఫాను ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలుసుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు.

రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. సమస్యలు తెలుసుకోనున్నారు. ఆ తరవాత పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పవన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది. ఈ పర్యటనలో పవన్ తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా పాల్గొననున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రజలకష్టాలను తెలుసుకుంటు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఓ పక్క సినిమా షూటింగులు మరోపక్క పార్టీ పనులతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగులు చేసుకుంటునే జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు.

దీంట్లో భాంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన ఖరారుచేసుకున్నారు. రేపు రాజమండ్రి చేరుకుని జిల్లాలోని కడియంలో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన కొనసాగనుంది. రైతన్నలతో సమావేశం కానున్నారు. ఇక రెండో రోజు పోలవరంలో పర్యటించనున్నారు పవన్. అంతేకాకుండా కొత్తపేట మండలంలోని రైతలతో కూడా ముఖాముఖీ ముచ్చటించనున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం పుణేలో అందమైన లొకేషన్స్ లో ఆ షెడ్యూల్ షూటింగ్ వై లేక్ (Wai lake) వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా పవన్ వై లేక్ వద్ద గోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన జనసైనికులను కలిశారు. వారితో కలిసి దిగిన ఫోటోను తానే స్వయంగా ట్విట్టర్ పోస్ట్ చేస్తూ ఆ విషయాన్ని తెలియజేశారు.