నేను రాజకీయాలు చేస్తే తప్పేంటీ ? వైసీపీ నేతలపై పవన్ ఫైర్

Pawan Kalyan tours Krishna district : సినిమాలు తీస్తూ…రాజకీయ పార్టీని నడపడం తప్పుబట్టిన వైసీపీ పార్టీపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నప్పుడు తాను సినిమాలు చేస్తుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుతూ..రాజకీయాలు చేస్తున్నప్పుడు సినిమాలు చేస్తూ..తాను ఎందుకు రాజకీయాలు చేయకూడదన్నారు. వైసీపీ నేతలకు పేకాట క్లబ్‌లు నడపడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడం ఆ శ్రద్ధ లేదన్నారు. మీడియా సంస్థలు మీకుండాలి..ఊడిగిం చేయాలి..దాష్టీకం పడాలా ? అవన్నీ గత రోజులు. ఎదురుతిరిగే రోజులన్నారు పవన్.

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. నివార్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి త్వరగా నష్ట పరిహారం అందివ్వాలని కోరుతూ.. కృష్ణా జిల్లా కలెక్టర్‌కు జనసేన నేతలు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. నివార్ తుపాను కారణంగా ఏపీలో కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పంట నష్టం అంచనా వేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రైతులతో స్వయంగా మాట్లాడి.. వారి బాధలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పవన్‌ ఒకరోజు దీక్ష కూడా చేపట్టారు.

పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసి పది రోజులు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ అంశంపై స్పందించ లేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. నష్ట పరిహారం చెల్లించాలంటూ అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా కష్ణా జిల్లా కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం ఇఛ్చేందుకు పవన్ వచ్చారు. 9 గంటలకు విజయవాడ చేరుకున్నారు. పవన్ అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లారు. కలెక్టర్‌ను కలిసిన అనంతరం ప్రజలతో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.