Pawan Kalyan Varahi Yatra
Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ జూన్ 23 వరకు ఖరారైంది. పది రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.
మొత్తం రాజకీయం ఆంధ్రప్రదేశ్ నుంచే చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేయి అని కొందరు అంటున్నారని చెప్పారు. ఒక్కడిగా వస్తానా? కూటమిగా వస్తానా? ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. కచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
పార్టీని పదేళ్లపాటు నడపడం సాధారణ విషయం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరంలో ఆయన ప్రసంగిస్తున్నారు. రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అంత సులువు కాదని చెప్పారు.
వారాహి పైకి చేరుకున్న సమర సేనాని @PawanKalyan గారు.#VarahiVijayaYatra pic.twitter.com/UvD1f8T83A
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 14, 2023
వారాహి విజయ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రీషియన్ స్తంభంపై స్వల్ప విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం తేరుకుని, స్వయంగా కిందికి దిగి వచ్చాడు.
భారీ జనసందోహం మధ్య పవన్ కల్యాణ్ కత్తిపూడికి చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో ఆయన కత్తిపూడి వచ్చారు. అక్కడ ఇప్పటికే ఉంచిన వారాహిపైకి ఎక్కి ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
భారీ జనసందోహం నడుమ కత్తిపూడి వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం చేరుకుంటున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.#VarahiVijayaYatra pic.twitter.com/4fIiDbSyZa
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 14, 2023
అన్నవరం రత్నగిరి కొండపైకి వాహనాలు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పవన్ కల్యాణ్ అన్నవరం నుంచి బయలుదేరే వరకు ట్రాఫిక్ దృష్ట్యా ఘాట్ రోడ్డుపై పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
JanaSenani @PawanKalyan the Only hope for the people of Andhra Pradesh, regardless of any generational differences
#VarahiVijayaYatra pic.twitter.com/Dl22izTCgF— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) June 14, 2023
* కత్తిపూడి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటున్న జనసేన కార్యకర్తలు
* కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడికి రానున్న పవన్
* వారాహి మీది నుంచి తొలి సారి ప్రసంగించనున్న పవన్
* బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న వారాహి
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జనసేనాని#VarahiVijayaYatra pic.twitter.com/NucVx4vGnD
— JanaSena Party (@JanaSenaParty) June 14, 2023
ఈరోజు సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడికి ర్యాలీగా వెళ్లనున్న జనసేనాని. కత్తిపూడి వద్ద వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభలో ప్రసంగం చేయనున్న పవన్ కళ్యాణ్.
అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అనంతరం తిరిగి తాను బస చేస్తున్న రామరాజు నిలయంకు చేరుకున్న పవన్.
https://twitter.com/JSPShatagniTeam/status/1668848175606796289
రామరాజు గెస్ట్ హౌస్ నుండి సత్యదేవుని దర్శనం కోసం బయలుదేరిన పవన్
కొద్దిసేపట్లో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
https://twitter.com/JanaSenaParty/status/1668650094583848963
ఈరోజు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుడిని దర్శించుకుంటారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడికి ర్యాలీగా వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈరోజు రాత్రికి గొల్లప్రోలులో పవన్ బస చేస్తారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది. అన్నవరం సత్యదేవున్ని దర్శించుకుని జనసేన అధినేత పవన్ యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటలకు అన్నవరం నుంచి బయల్దేరి ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సెంటర్ వద్దకు పవన్ చేరుకుంటారు. యాత్రలో భాగంగా అక్కడ సభలో పవన్ ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది.
Pawan Kalyan Varahi Yatra
అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకుని ఆ తరువాత పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమవుతుంది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. ఏపీలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలుత తొమ్మిది నియోజకవర్గాల్లో యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జూన్ 23వ తేదీ వరకు తొలిదశ షెడ్యూల్ ఖరారు కాగా.. 10 రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.