వైసీపీ ప్రభుత్వానికి పవన్ శాపనార్థాలు

  • Publish Date - January 21, 2020 / 08:53 AM IST

వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాపనార్థాలు పెట్టారు. వినాశానికి దారి తీస్తుందని, భవిష్యత్‌లో అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులపైన దాడి చేస్తారా ? మేకులున్న లాఠీలతో లాఠీఛార్జీ చేస్తారా ? నోటిమాట రాని వ్యక్తిని కొడుతారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలతో ప్రారంభం చేసిన వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు జనసేనానీ.

2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన కార్యాలయానికి అమరావతి రాజధాని రైతులు వచ్చారు. దెబ్బతిన్న రైతులను పవన్ పరామర్శించారు. ఆందోళనల్లో పాల్గొన్న వారిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ప్రజాభిప్రాయం లేకుండానే రాజధానిని తరలిస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

దెబ్బతిన్న రైతులను చూస్తే చాలా బాధేస్తోందని, ఆవేదన కలుగుతోందని భావోద్వేగానికి గురయ్యారు పవన్. దివ్యాంగులపైనా దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా దాడి జరిగిన దివ్యాంగులుడి పరిస్థితి చూసి చలించిపోయారు పవన్. 

సెక్రటేరియట్ ఉద్యోగులు దీనిపై స్పందించాలని, వీరికి అండగా ఉండాలని, రాజకీయ వ్యవస్థను నమ్మవద్దని సూచించారు. అమరావతి మాత్రం ఇక్కడి నుంచి కదలదని మరోసారి హామీనిచ్చారు. ధర్మానికి నిలబడే వ్యక్తిని..మోసం చేసిన వారికి ప్రజలపై ప్రేమ లేదన్నారు. రాజధాని రైతులు జరిపిన ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వమే పంపిస్తోందని ఆరోపించారు.

తాను అమరావతికి వెళ్లాలని అనుకున్నా..పోలీసులు కదలినివ్వలేదన్నారు. డీఐజీ స్థాయిలో ఉన్న అధికారిని అక్కడ పెట్టారన్నారు. రాజకీయంగా చేయాల్సి పోరాటమన్నారు. వైసీపీకి వారికి కావాల్సింది..గొడవ..పోలీసులను అడ్డుకోవడం పెద్ద విషయం కాదని..కానీ ఇందులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే వీలు ఉందనే కారణంగా..తాను ఆ విధంగా నిర్ణయం తీసుకోలేదన్నారు పవన్.

Read More : నేను పవన్ కళ్యాణ్ : ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదు

ట్రెండింగ్ వార్తలు