Pawan Kalyan Varahi Yatra fourth phase : ఇప్పటికే మూడు విడతలు వారాహి యాత్ర (Varahi VIjaya Yatra)ను విజయవంతంగా పూర్తి చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. తన వారాహి యాత్రలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ పవన్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన ఫ్రాంతాల్లో ఉండే సమస్యల గురించి కూలంకషంగా తెలుసుకుంటున్నారు.
ఇక మరోసారి తన యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుపడనున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి నాలువ విడత వారాహి యాత్రకు పవన్ (Janasena Varahi Yatra) సిద్ధమవుతున్నట్టు సమాచారం. నాలుగో విడత వారాహి యాత్ర ఎప్పుడెప్పుడా అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించిన అనంతరం టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీకి వెళతాయని ప్రకటించటంతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ ప్రకటన తరువాత పవన్ వారాహి యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వైసీపీ పాలన అంతం కోసం ఏ ఒక్క అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నానని దాని కోసం ఏదైనా చేస్తానని పదే పదే చెబుతున్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు పరామర్శ తరువాత చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనేది ఓ అంచనా మాత్రమే ఉండేది. కానీ పవన్ దానిపై ఫుల్ క్లారిటీ ఇవ్వటంతో అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.