దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు

  • Publish Date - September 12, 2020 / 11:07 AM IST

Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.



ఫామ్ హౌస్ లో ఉన్న పవన్..ఒక దీపాన్ని వెలిగించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు, ఇతరులు దీపాలు వెలిగిస్తున్నారు. పవన్ కు మద్దతుగా చిరంజీవి సతీమణి సురేఖ కూడా తులసి మొక్కకు పూజ చేసి దీపం వెలిగించడం విశేషం. ఈ ఫొటోను సురేఖ తనయుడు రామ్ చరణ్ తేజ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

దీపాలు వెలిగిస్తూ..నిరసన వ్యక్తం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియచేశారు పవన్. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. bharatiya culture matters హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 6న స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. దాదాపు 62 సంవత్సరాల చరిత్ర ఉంది. ఊహించని ఘటనతో భక్తకోటి నివ్వెరపోయింది. హిందూ ధార్మిక సంఘాలైతే ఆగ్రహంతో రగిలిపోయాయి.
https://10tv.in/pawan-kalyan-and-vakeel-saab-team-expresses-their-condolences-to-the-families-of-the-deceased-fans/
రధసప్తమి రోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే స్వామి వారి కళ్యాణమహోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. రధ సప్తమినాడు లక్ష్మీ నరసింహా స్వామిని పెళ్ళికొడుకును చేయడం దగ్గర్నుంచి కళ్యాణం, రధోత్సవం, తెప్పోత్సవం, చక్ర స్నానాల వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.



అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ప్రముఖ నౌకావ్యాపార వేత్త శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ ఈ ఆలయాన్ని నిర్మించడంతో వారి వారసులు ఏటా ఈ రధోత్సవంలో పాల్గొంటారు. రధోత్సవం అనంతరం ఆ రధాన్ని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు.

స్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవడం, లేదంటే ఇంటి దగ్గర వివాహం చేసుకుని స్వామివారి సన్నిధిలో కళ్యాణవ్రతం చేసుకోవడం భక్తుల ఆనవాయితీ. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఆరు నెలలుగా పనిచేయడం లేదు. ఘటనకు కారణాలు ఎంటన్నది తెలియకుండా పోయింది.



క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? భక్తులు పెట్టే నిప్పుల కుంపటి నుంచి అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయా..? మతి స్థిమితం లేని వ్యక్తి రథాన్ని తగలబెట్టారా..? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఇప్పటిదాకా రథం దగ్ధం ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.