Payyavula Keshav: చంద్రబాబు జీవితంతోనే కాకుండా వీరి జీవితంతోనూ మీరు ఆడుకుంటున్నారు: పయ్యావుల కేశవ్

ఏపీ సీఐడీ చీఫ్‌ను తాను ఒక్క ప్రశ్న అడుగుతున్నానని.. 1997లో స్థాపించిన కంపెనీ..

Payyavula Keshav

Payyavula Keshav – Chandrababu Arrest: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అంతేగాక, హైదరాబాద్‌లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ఏపీ సీఐడీ చీఫ్‌ను తాను ఒక్క ప్రశ్న అడుగుతున్నానని.. 1997లో స్థాపించిన కంపెనీ సీమెన్స్ అని, అది భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోందని తెలిపారు. సీమెన్స్ కు సంబంధం లేదని ఎలా చెబుతారని నిలదీశారు, సీమెన్స్ రాసిన లేఖ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు జీవితంతోనే కాకుండా ఏపీ యువత జీవితాలతోనూ ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ పాపం ఊరికే పోదని అన్నారు. ఈ పాపానికి మరో కంపెనీ రాష్ట్రం వైపు చూస్తుందా? అని నిలదీశారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా సీమెన్స్ కంపెనీ కార్యకలాపాలను ప్రశంసించారని అన్నారు.

వైసీపీ చరిత్ర చూస్తే సూట్ కేసు కంపెనీలే కనపడతాయని, దీంతో మిగతా వారు అందరూ అలాగే ఉంటారని ఆ పార్టీ నేతలు అనుకుంటే తప్పని చెప్పారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కట్టగట్టి గంగలో కలపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

Minister KTR : డాక్టర్ కావటం అంత ఈజీ కాదు,నాకు ర్యాంక్ వచ్చినా ఎంబీబీఎస్ సీటు రాలేదు : కేటీఆర్