Somireddy On Pegasus Spyware : పెగాసెస్ స్పైవేర్ చంద్రబాబు కొనుంటే, వివేకా హత్య జరిగేదే కాదు-సోమిరెడ్డి

పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగేదే కాదు..(Somireddy On Pegasus Spyware)

Somireddy On Pegasus Spyware : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు, కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా కాకుండా.. పార్టీ పరంగా.. వైసీపీ… ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టు తాము నమ్ముతున్నాం అన్నారు. దీనిపై గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశామన్నారు.

ఇక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు ఆరోపణల అంశంపైనా సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు. పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్ అన్నారు సోమిరెడ్డి. దేశాల మధ్య రహస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.(Somireddy On Pegasus Spyware)

Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు-లోకేష్ నారా

టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీనే సమాధానమిచ్చారని సోమిరెడ్డి గుర్తు చేశారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈ పెగాసెస్ స్పైవేర్ మీద అవగాహన లేకపోవచ్చని, అందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అన్నారు. పీకేలు, కేకేలు వంటి వారు మమతా బెనర్జీతో ఇలా చెప్పించి ఉంటారని భావిస్తున్నాం అన్నారు.

పెగాసెస్ స్పై వేర్ నాటి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఉండేదే కాదని సోమిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్ ను కొనుగోలు చేసే అవకాశం లేదన్నారాయన. మోదీ ప్రభుత్వం మీద ఈ ఆరోపణలు ఉన్నాయని, దీనిపై సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిషన్ వేసిందని సోమిరెడ్డి గుర్తు చేశారు. విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు.

Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబును, లోకేశ్ ను ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలతో తీవ్రంగా డ్యామేజ్ చేసి ఎడ్వాంటేజ్ తీసుకున్నారని మండిపడ్డారు. కోడి కత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు… పీకే వ్యూహాలే అని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత కాలుకు కట్టు కట్టించి రాజకీయం చేసింది పీకేనే అన్నారు. మమతకు, జగన్ కు ప్రశాంత్ కిషోర్ యే స్ట్రాటజీలు రూపొందిస్తున్నారని సోమిరెడ్డి చెప్పారు. పెగాసెస్ స్పై వేర్ ను చంద్రబాబు కొనుగోలు చేశారని మమతా బెనర్జీకి పీకేనే తప్పుడు సమాచారం అందించారని నమ్ముతున్నాం అన్నారు.

ట్రెండింగ్ వార్తలు