నిన్న నెల్లూరు, నేడు గుంటూరు…స్పృహ తప్పి పడిపోతున్న ప్రజలు

  • Publish Date - December 13, 2020 / 01:28 PM IST

people fainting in gunturu district : మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు. నేడు గుంటూరు ప్రజలు తెలియని వ్యాధితో స్పృహ తప్పి పడిపోతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోని కాలనీ వాసులు స్పృహ తప్పిపడిపోతున్నారు. కాలనీకి చెందిన యువకుడు శనివారం రాత్రి స్పృహతప్పి పడిపోవటంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇటీవలే ఇద్దరు వ్యక్తులు కూడా స్పృహతప్పి పడిపోయారు. దీనికి సమీపంలోని పరిశ్రమలనుంచి వెలువడే కాలుష్యమని తెలుస్తోంది. అర్దరాత్రి సమయంలో రసాయన పరిశ్రమ నుంచి వ్యర్థాలను విడుదల చేయటం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.