Perni Nani Criticise Pawan Kalyan (Photo : Google)
Perni Nani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు మాజీమంత్రి పేర్నినాని. పవన్ కల్యాణ్ మాటలు జనసైనికులకు సైతం నచ్చడం లేదన్నారు. జగన్ కు దమ్ముంది కనుకే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా రాజకీయం చేశారని పేర్నినాని చెప్పారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులా రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకునే రాజకీయం జగన్ ది కాదన్నారు.
బీజేపీ కంటే చంద్రబాబే ముఖ్యం అని పవన్ కల్యాణ్ తేటతెల్లం చేశారని పేర్నినాని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోరాటం చేశానని పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కొల్లేరు పెదింట్లమ్మ గుడి వంతెనపై కారు వేసుకుని వెళ్దాం. నీకు దమ్ముంటే నాతో రా అని పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు పేర్నినాని.
Also Read: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!
ఒకసారి NDAలో ఉన్నాను అంటావు. మరొకసారి బయటకి వచ్చాను అంటావు. ఎన్డీయేలో భాగస్వామైతే జీహెఎంసీ ఎన్నికల్లో ఎవరికి మద్దతిచ్చావు? అని పవన్ ను ప్రశ్నించారు పేర్నినాని. పవన్ కల్యాణ్ ఎన్డీయేలో ఉంటే తెలంగాణలో సీట్ల ఒప్పందం జరిగిందా? అని అడిగారాయన. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మున్నూరు కాపుల ఓట్లు చీల్చడానికి పవన్ కల్యాణ్ 32 సీట్లలో పోటీ చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు.
ఏపీలో కాపులు ఉన్న చోట మాత్రమే వారాహి తిరుగుతోందని, తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్న చోట్ల పోటీ అంటున్నారు అని పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ను సన్యాసితో పోల్చారు పేర్నినాని. ప్రధాని మోదీ ఫోన్ నంబర్ ఉంటే ఏం చేస్తావ్? ఫోన్ చేసి మాట్లాడే సత్తా ఉందా..? అని పవన్ కల్యాణ్ ను నిలదీశారు పేర్నినాని. నిజానికి మోదీ, అమిత్ షా అంటే పవన్ కి వణుకు అని చెప్పారాయన. పవన్ ఎన్డీయేలో ఉంటే మాకేంటి? చంద్రబాబు తొత్తుగా ఉంటే మాకేంటి..? పవన్ ఎన్డీయేలో ఉండటం వల్ల రాష్ట్రానికి పావలా ఉపయోగం ఉందా..? రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పదేళ్లుగా పవన్ ఏం పూడ్చాడు..? అని ప్రశ్నలు కురిపించారు పేర్నినాని. విభజన వల్ల వచ్చిన నష్టాన్ని కేంద్రం దగ్గర ఎందుకు అడగలేదని పవన్ ను నిలదీశారాయన.
టీడీపీ నేత నారా లోకేశ్ పైనా విరుచుకుపడ్డారు పేర్నినాని. ”తండ్రిని జైల్లో.. తల్లి, భార్యలను రోడ్డుపై వదిలేసి 25 రోజులు లోకేశ్ ఢిల్లీలో ఉన్నాడు. డిల్లీ లాయర్లు అంతా విజయవాడలో తిరుగుతుంటే.. లోకేశ్ ఢిల్లీలో ఏం చేశాడు..? ఢిల్లీలో ఏం చేద్దామని లోకేశ్ వెళ్లాడు. ఎవరిని మేనేజ్ చెయ్యడానికి వెళ్ళాడు? వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. రూ.370 కోట్ల స్కాంలో రూ.27 కోట్లు సిగ్గు లేకుండా టీడీపీ అకౌంట్ లో వేసుకున్నారు.
Also Read: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?
స్కామ్ కాకపోతే సీమెన్స్ ఇస్తానన్న రూ.3వేల కోట్లు ఏమయ్యాయి? లోకేశ్ సమాధానం చెప్పాలి..? చంద్రబాబు నీతిమంతుడు అయితే 1995 నుండి మీ వ్యాపారాలు, సంపాదనపై కోర్టు మానిటరింగ్ విచారణకు సిద్ధమా..?” అని లోకేశ్ కు సవాల్ విసిరారు పేర్నినాని.