సామాజిక బాధ్యతగా భావించే ట్రాఫిక్ ఫైన్లు భారీగా పెంచామని సమాచార, రవాణా శాఖ మంత్రి Perni Nani తెలిపారు. కఠిన నిబంధనలు, రూల్స్ విధిస్తే రోడ్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిలో మార్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ ఫైన్లతో కట్టడి చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ ముఖ్య విధి అని, ఆ దిశగా ఆలోచించే జరిమానాలు పెంచామని, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు.
‘దీనిపై రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మోటారు వాహనాల నిబంధనలు పాటించని వారిని సమర్థిస్తున్నాయా? ఈ అంశంపై హేళనగా మాట్లాడేవారు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
ఫార్మాలిటీ ఫైన్లతో రిపీటెడ్‌గా తప్పులు:
ఫార్మాలిటీ ఫైన్లతో పదేపదే రూల్స్ బ్రేక్‌కు పాల్పడుతున్నారు. వాళ్లు నిర్లక్ష్యంగా నడిపే వాహనం కారణంగా అతనొక్కడే కాదు.. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తే వందే కదా అని నిర్లక్ష్యం వీడట్లేదు. అదే రూ.వెయ్యి విధిస్తే కొంత జాగ్రత్త ఉంటుంది. వాహన చోదకులు చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకూడదనే ఫైన్లు పెంచాం.
https://10tv.in/minister-kannababu-comments-on-chandrababu-and-lokesh-over-his-visit-in-flood-areas/
డబ్బు సంపాదించుకోవాలని కాదు:
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంపై కాంపౌండింగ్ ఫీజులు పెంచడం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫీజుల పెంపు వల్ల సంవత్సరానికి రూ.150 కోట్లు ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రజా సంక్షేమం కోసం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ జరిమానాలతో వచ్చే ఆదాయం లెక్క కాదు. కేవలం బాధ్యత విస్మరించి ప్రమాదాలకు కారణం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
వానాకాలం ముగియగానే:
77 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల రోడ్లపై గుంతలు సహజంగానే ఏర్పడుతున్నాయి. వీటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు చేస్తూ.. ఫైన్లు తర్వాత విధించండి.. ముందు రోడ్లు బాగు చేయండని వెటకారంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కావట్లేదు. సీజన్ ముగియగానే గుంతలన్నీ పూడ్చేలా రూ.2వేల 500 కోట్లతో మరమ్మతులు చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారనేది గుర్తుంచుకోవాలి.