Andhra Pradesh: ఫోన్‌లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. మోహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

ఓ వ్యక్తి ఫోన్‌లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. అతనిపై మరో ఇద్దరు పెట్రోల్‌ పోసి నిప్పటించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా మారింది.

Andhra Pradesh: దేశంలో నేరాలు, దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకు పేట్రేగిపోతున్నాయి. చిన్నచిన్నగొడవలకే ఒక్కరిపై ఒకరు దాడులు చేసుకునే స్థితికి వచ్చేశారు. మరోవైపు కోపంలో హత్యాలు చేసుకునే స్థాయికి వెళ్లిపోతున్నారు. వీటికి తోడు మద్యంమత్తులో విచక్షణ కోల్పోయి.. దారుణాలకు పాల్పడుతూ.. జీవితాలను ఛిన్నభిన్నం చేసుకుంటున్నారు. చిన్నపాటి గొడవలకే సహనం కోల్పోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఆలాంటి ఘటననే వైఎస్‌ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం మడూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్‌లో పెద్దగా మాట్లాడుతున్నాడని.. అతనిపై మరో ఇద్దరు పెట్రోల్‌ పోసి నిప్పటించారు. ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా మారింది.

Andhra Pradesh : అనకాపల్లిలో పట్టపగలే బ్యాంకు దోపిడీ..తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలు చోరీ

గ్రామానికి చెందిన బాధితుడు నరసింహ..పాత బట్టల వ్యాపారం చేసుకుంటు.. జవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం మడూరు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో భాదితుడు నరసింహా మద్యం సేవిస్తుండగా.. పోన్‌ వస్తే.. గట్టిగా మాట్లాడుతున్నాడు. పక్కనే ఉన్న మరో గ్రూప్‌లో మద్యం తాగుతున్న చిన్న, ప్రసాద్‌లు ఫోన్‌లో ఎందుకు అరుస్తూ మాట్లాడుతున్నావని నరసింహతో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి.. ఘర్షణకు దారితీసింది.

Andhra Pradesh : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై ఎస్సై దాడి

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్న, ప్రసాద్‌లు నరసింహ మోహంపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో ఆ పక్కనే ఉన్న స్థానికులు..అతనిని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన నరసింహ పరిస్ధతి విషమంగా మారడంత..మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ సంజీవరెడ్డి.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు