Pilli Subhash Chandra Bose: గొడవలు శ్రుతిమించుతున్న వేళ.. జగన్‌ను కలిసిన పిల్లి సుభాష్ చంద్రబోస్

వేణుకి, బోస్‌కి మధ్య విభేదాలు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.  

Pilli Subhash Chandra Bose meets YS Jagan

Pilli Subhash Chandra Bose – YCP: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌(YS Jagan)ను ఇవాళ వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఉమ్మడి తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో వైసీపీ గ్రూపుల గొడవలు శ్రుతిమించుతున్న వేళ జగన్ ను సుభాష్ చంద్రబోస్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కీలక వైసీపీ నేతలు గ్రూపు మీటింగులు జరపారని, బల సమీకరణలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ గా పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఉన్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మంత్రి వేణు మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నియోజకవర్గంలోని పరిస్థితులను జగన్ కు పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించారు. మంత్రి వేణు తన అనుచరులపై వ్యవహరిస్తున్న తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జగన్ తో భేటీ అనంతరం వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డితో పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమయ్యారు.

ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ… నియోజవర్గంలో పరిస్థితులన్నీ జగన్ కి చెప్పానని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడతానని అన్నారు. నియోజక వర్గంలో పరిస్థితులపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గతంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. వేణు తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి అయ్యారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి వేణుతో బోస్‌కి మధ్య విభేదాలు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

East Godavari: వైసీపీలో శ్రుతిమించుతున్న గ్రూపుల గొడవలు.. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో..