PM Modi : ఆ రంగంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉండాలి- విశాఖలో ప్రధాని మోదీ

దేశంలో రెండు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టులు చేపడితే, ఒకటి విశాఖలోనే నిర్మిస్తున్నాం.

PM Modi : ఆంధ్ర రాష్ట్రం ప్రజల లక్ష్యాలను సాధించేందుకు సహకరిస్తానని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలకు ఎట్టి పరిస్థితిల్లోనూ భంగం వాటిల్లనివ్వనని అన్నారు. ఆంధ్రప్రదేశ్.. సాధ్యతలు, అవకాశాలు కలిగిన రాష్ట్రం అని ప్రధాని మోదీ చెప్పారు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి మా విజన్ అని వెల్లడించారు. 2047 కల్లా రాష్ట్రంలో రెండున్నర ట్రిలియన్ల డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ప్రధాని మోదీ. విశాఖలో ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

స్వర్ణాంధ్ర లక్ష్యం చేరుకునేందుకు కృషి చేస్తున్నాం..
”ఆంధ్ర ప్రజల అభిమానం, ప్రేమకు నా కృతజ్ఞతలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం దక్కింది. 60 సంవత్సరాల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం మూడోసారి వచ్చింది. చంద్రబాబు తన స్పీచ్ లో చెప్పిన అన్ని విషయాలను గౌరవిస్తున్నా. స్వర్ణాంధ్ర లక్ష్యం చేరుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరానికి చేరుస్తుంది. రాష్ట్రంతో పాటు దేశానికి అభినందనలు తెలుపుతున్నా.

భవిష్యత్తులో గ్రీన్ హైడ్రో ఉత్పత్తి కేంద్రంగా విశాఖ నిలవబోతోంది..
సృజనాత్మకత కారణంగా ఐటీ, సాంకేతికతకు ఏపీ కేంద్రంగా మారింది. సరికొత్త టెక్నాలజీలకు రాష్ట్రం సారథ్యం వహించే కేంద్రం కాబోతోంది. దేశంలో రెండు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టులు చేపడితే, ఒకటి విశాఖలోనే నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రో ఉత్పత్తి కేంద్రంగా విశాఖ నిలవబోతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేసే అవకాశం నాకు దక్కింది.

Also Read : వెంటాడుతున్న కేసులు.. వైసీపీ నేతలకు పెద్ద సవాల్‌

పట్టణీకరణకు రాష్ట్రం నవ ఉదహరణగా నిలవబోతోంది..
దేశంలో మూడు పార్కులు పెడితే, విశాఖలో ఒకటి కేటాయించాం. పట్టణీకరణకు రాష్ట్రం నవ ఉదహరణగా నిలవబోతోంది. క్రిస్ సిటీ శంకుస్థాపనతో స్మార్ట్ సిటీ బెంగళూరు కారిడార్ లో భాగం కాబోతోంది. శ్రీసిటీ తయారీ రంగంలో ఫలితాలు చూస్తున్నారు. తయారీ రంగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలి. మొబైల్ తయారీ రంగంలో భారత్ మంచి స్థానానికి ఎదిగింది.

రైల్వో జోన్ చిరకాల కల నెరవేర్చాం..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యాలయానికి పునాది వేశాం. రైల్వో జోన్ చిరకాల కల ఇవాళ నెరవేర్చాం. ఉత్తరాంధ్రలో వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాల విస్తరణ జరుగుతుంది. పర్యాటక, స్థానిక ఆర్థిక వ్యవస్థకు జోన్ తో కొత్త అవకాశాలు లభిస్తాయి. రైల్వేలో ఆంధ్రలో వందశాతం విద్యుదీకరణ జరిగాయి. రాష్ట్రంలో 70కిపైగా రైల్వే స్టేషన్లను అమృత భారత్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రానికి 7 వందేభారత్ రైళ్లు నడిపిస్తున్నాం.

సుసంపన్న ఆంధ్రప్రదేశ్ కు కట్టుబడి ఉన్నాం..
మౌలిక వసతుల కల్పన విప్లవం, మెరుగైన కనెక్టివిటీ సౌకర్యాలతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి. విశాఖతో పాటుగా రాష్ట్రంలోని తీర ప్రాంతాలు దేశ వాణిజ్య ఆదాయ రంగంలో కీలక పాత్ర పోషించాయి. మరింత ఊతం ఇచ్చేందుకు బ్లూ ఎకనామీతో మిషన్ మోడ్ తో నడిపిస్తున్నా. విశాఖ షిప్పింగ్ హార్బర్ ను ఆధునీకరించబోతున్నాం. ప్రగతి రంగంలో అందరినీ కలుపుకోవడమే మా మార్గం. సుసంపన్న ఆంధ్రప్రదేశ్ కు కట్టుబడ్డాం” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read : బలమైన భారత్ కోసం కృషి చేస్తున్నారు- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం