Pawan Kalyan : బలమైన భారత్ కోసం కృషి చేస్తున్నారు- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం
వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారు..

Pawan Kalyan : ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ వెలుగులు నింపారని పవన్ కల్యాణ్ అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని చెప్పారు. రాష్ట్రంలో వెలుగులు నింపిన ప్రధాని మోదీకి అండగా ఉంటామన్నారు పవన్ కల్యాణ్.
”సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ప్రధాని మోదీ ఏకతాటివైపు నడిస్తున్నారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛభారత్ నినాదాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న ప్రధాని మోదీకి అండగా ఉంటాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : తమ్మినేని సీతారాంకి సోషల్ మీడియా సెగ!
ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ తయారు చేశారని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. హైదరాబాద్ వెళ్లి చూస్తే చంద్రబాబు విజన్ ఏంటో అర్థమవుతుందన్నారు లోకేశ్. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఉన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేశ్ చెప్పారు.
ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈ సభకు హాజరయ్యారు. 5వేల మంది పోలీసులతో ఈ సభకు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read : వెంటాడుతున్న కేసులు.. వైసీపీ నేతలకు పెద్ద సవాల్