Polavaram project : మాకు నష్టం జరిగింది..మరి హైదరాబాద్‌ని ఏపీలో కలిపేస్తారా? : మంత్రి బొత్స

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

Polavaram project controversy AP-Telangana : పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తువల్ల భద్రాచలం మునిగిపోవటానికి ఎటువంటి శాస్త్రీయతాలేదని మంత్రి అంబటి స్పష్టంచేశారు. పువ్వాడ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఏపీలో విలీన గ్రామాల ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని..విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే..ఏపీని కూడా తెలంగాణలో కలపాలని అడుగలమా? విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగింది. మరి హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోయింది ఏపి..మరి హైదరాబాద్ ను ఏపీలో కలపాలని మేం అడగగలమా? అంటూ ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యం తప్ప ఈ వివాదాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు.

సీఎం అయినా..మంత్రులైనా బాధ్యతగానే మాట్లాడాలి అంటూ సూచనలు చేసేశారు మంత్రివర్యులు బొత్స. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లేడే పువ్వాడ ఆయన సంగతేంటో ఆయన చూసుకోవాలని సూచించారు. ముంపు మండలాల బాద్యత ఏపీ చూసుకుంటుంది అంటూ చురకలు వేశారు. ఏపీలో ముంపు మండలాల సంగతి ఏపీ ప్రభుత్వం చూసుకుంటుంది. తెలంగాణలో ముంపు మండలాల సంగతి పువ్వాడ చూసుకుంటో సరిపోతుంది అంటూ ఎద్దేవా చేశారు. ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలంటే..ఏపీని తెలంగాణని కలపాలను అడుగుతాం అని అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు