Polavaram Project Will Not Be Completed In Certain Period Center
Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్ నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్రం తెలిపింది. పోలవరం పనుల్లో జాప్యం జరిగే మాట వాస్తవమేనని తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల అడిని ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యం మాత్రమే కాకుండా కరోనా పరిస్థితుల్లో పోలవర నిర్మాణ పనులు జాప్యం జరుగుతోందని ఆయన వివరించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తయినట్టు తెలిపారు. ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73శాతం, పైలెట్ చానల్ పనులు 34శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు టీఎంసీ ఆమోదించిన మాట వాస్తవమేనన్నారు. 2020 మార్చి నెలలో సవరించిన అంచనాలపై RCC నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఈ నివేదికలో పోలవరం సవరించిన అంచనాలకు రూ.35950.16 కోట్లకు మాత్రమే అంగీకరించిందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివరణ ఇచ్చారు.