facebook cheater: ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపల్లికి చెందిన గుణశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ ప్రొఫైల్ తో ఫేస్ బుక్, వాట్సాప్ లో అమ్మాయిలను మోసం చేస్తున్నాడు గుణశేఖర్. పలువురు అమ్మాయిల నుంచి రూ.10లక్షలు దండుకున్నాడు. గుణశేఖర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గరి నుంచి రెండు నాటు తుపాకులు, రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా మోసం చేసే వాళ్లు ఎక్కువయ్యారు. ఎక్కువగా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి విషయాన్ని, ప్రతి ఫొటోని సోషల్ మీడియాలో పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు. ఎవరైనా వేధించినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్నారు.