TDP Leader Maruti Chaudhary: వ్యవసాయ పంపు సెట్ల విషయంలో ఘర్షణ.. టీడీపీ నేత మారుతి చౌదరి అర్థరాత్రి అరెస్ట్..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మారుతి చౌదరిని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

TDP Leader Maruti Chaudhary

TDP Leader Maruti Chaudhary: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం (Kalyandurgam) నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మారుతి చౌదరి (TDP Leader Maruti Chaudhary) ని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం (Anantapur) లో అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్  (Kalyanadurgam Police Station) లో ఉంచారు. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పంపు సెట్లు అందిస్తున్న విషయం విధితమే. సబ్సిడీపై రైతులకు ఇచ్చే వ్యవసాయ పంపు‌సెట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  (YSR Congress Party) నాయకులు అక్రమంగా తరలిస్తున్నారని మారుతీ చౌధరి ఆరోపించారు. అంతేకాక, శెట్టూరు మండలం లక్ష్మoపల్లి‌కి వెళ్లి వైసీపీ నాయకులు అక్రమ తరలిస్తున్న వ్యవసాయ పంపు సెట్లను మారుతీ చౌదరి అడ్డుకున్నాడు.

Telangana TDP: ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీడీపీ ఆవిర్భావ సభ.. పాల్గోనున్న చంద్రబాబు, రెండు రాష్ట్రాల నేతలు

వైసీపీ నేతలు తరలిస్తున్న వ్యవసాయ పంపుసెట్లను అడ్డుకోవటంతో వైసీపీ నాయకులు, మారుతీ చౌదరికి అర్ధరాత్రి సమయంలో వాగ్వివాదం చోటు చేసుంది. అనంతరం మారుతి చౌదరి అనంతపురంలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, పోలీసులు మారుతి చౌదరి ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ‌కు పోలీసులు తరలించారు. శెట్టూరు పోలీస్ స్టేషన్‌లో 354, 147, 148, 506, 452, 323 సెక్షన్ల కింద మారుతి చౌదరిపై కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు