Chalo Amalapuram : ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ…బీజేపీ చలో అమలాపురంకు పిలుపునిచ్చింది. అమలాపురంలోని ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది.
దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి, ఇతర నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతిలేదని పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది. అందులో భాగంగా..బీజేపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును హౌస్ అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ లు అమలాపురానికి చేరుకున్నారు. వీరిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. విష్ణువర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో కావలిలో ఆది నారాయణరెడ్డిని అరెస్టు చేశారు.
https://10tv.in/in-pics-pm-narendra-modis-70th-birthday-a-glimpse-of-his-timeless-pictures-from-the-past/
అరెస్టు చేయడంపై సోము ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగ ఆందోళన చేస్తామంటే…ఎందుకు అరెస్టుుల చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ చలో అమలాపురానికి జనసేన, ధార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. అంతర్వేది ఘటనతో పాటు రాష్ట్రంలోని ఆలయాల ఘటనలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలోని హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులపై వరుస దాడుల ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. సెప్టెంబరు 5న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్యరథం మంటలకు కాలిపోయింది.
60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పింది. దుర్గగుడిలో వెండి సింహాలు మాయం కావడం, విజయవాడలోని సాయిబాబా విగ్రహం ధ్వంసం వంటి, ఇతర ఘటనలు జరగడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విచారణకు ఆదేశాలు జారీ చేసింది.