Andhra pradesh Politics : మంత్రి రోజా ఇంటిపై దాడి ఘటనలో 30మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు

నగరిలో మంత్రి రోజా ఇంటిై దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారనే ఆరోపణలో 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Andhra pradesh Politics : నగరిలో మంత్రి రోజా ఇంటిై దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారనే ఆరోపణలో 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రోజా లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌ అని..పప్పు అని ఇలా రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. తెలుగు మహిళలు చీర, జాకెట్ తీసుకుని నగరిలో ఉన్న మంత్రి రోజా ఇంటిపైకి వెళ్లారు. ఇంటి ముందు టీడీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడం, బలవంతంగా అక్కడి నుంచి నగరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మంత్రి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారని..ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారంటూ పోలీసులు 30మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

మంగళవారం జరిగిన ఈ ఘటన నగరిలో ఉద్రిక్తతలకు దారి తీసింది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో పోలీసులు టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించి వైసీపీ నేతలను అక్కడనుంచి పంపించివేశారు. మంత్రి ఇంటిపై దాడికి యత్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది.

కాగా..యువగళం పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చంద్రబాబు, లోకేశ్ సంపాదనపై, తన సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ వేద్దాం అని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేరుగా ఎదురు పడితే లోకేశ్ గుండె ఆగిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ అంకుల్‌ ఒక ఐరెన్‌లెగ్‌ అంటూ తనదైనశైలిలో నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఇంకోసారి తన గురించి మాట్లాడితే అడవాళ్లతో కొట్టిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. లోకేశ్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు రోజా ఇంటిముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగటం సదా మామూలుగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయటం జరిగింది.

 

ట్రెండింగ్ వార్తలు