Andra pradesh : కుప్పంలో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు

తన నియోజక వర్గం అయిన కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముందుగానే ఖరారు అయిన విషయం తెలిసిందే. కానీ కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకుపోయారు. దీంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Andra pradesh : తన నియోజక వర్గం అయిన కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముందుగానే ఖరారు అయిన విషయం తెలిసిందే. కానీ కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకుపోయారు. దీంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇటీవల చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ మంగళవారం (జనవరి 3,2022) ఉత్తర్వులు జారీచేసింది. కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు సభల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Andhra Pradesh : సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు

కానీ ఇప్పటికే చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పర్యటన ఖరారు కావటంతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూనే చంద్రబాబు సభ కోసం మంగళవారమే కుప్పం పోలీసులతో టీడీపీ నేతలు సంప్రదించారు. సభ ఎక్కడ నిర్వహించుకోవచ్చని అడిగారు. అయినా పోలీసులు మాత్రం చంద్రబాబు సభకు అనుమతి ఇవ్వలేదు. పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు అనుగుణంగానే సభ నిర్వహిస్తామని టీడీపీ తెలిపినా పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రచార రథం సీజ్ చేసి వాహనం తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసుల చర్యపై టీడీపీ నేతలు, కార్యకర్తు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్యమేనా? సభలు నిర్వహించుకోవటానికి కూడా స్వేచ్ఛ లేదా? ఇదేం నియంతృత్వ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

 

ట్రెండింగ్ వార్తలు