Policemen humanity : మానవత్వం చాటుకున్న పోలీసులు

కర్నూల్ జిల్లా శ్రీశైలం పోలీసులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నట్టడవిలో శ్రీశైలం భీముని కొలను దగ్గర ఊపిరాడక పడి ఉన్న భక్తున్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు.

Policemen humanity : కర్నూల్ జిల్లా శ్రీశైలం పోలీసులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నట్టడవిలో శ్రీశైలం భీముని కొలను దగ్గర ఊపిరాడక పడి ఉన్న భక్తున్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. శ్రీశైలం వన్ టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్, పోలీసు సిబ్బంది భుజాలపై మోసుకుంటూ బాధితుడిని రక్షించే ప్రయత్నం చేశారు.

నల్లమల అడవిలో ఒక భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరి ఆడక పడిపోగా గమనించిన కొందరు డయల్ 100 కి కాల్ చేశారు. దీంతో హుటాహుటీన స్థానిక శ్రీశైలం పోలీసులు వెంటనే అక్కడికి ఆక్సిజన్ సిలిండర్, వైద్య సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తికి వైద్యం అందించి అతన్ని భుజాలపై ఎత్తుకొని కైలాస ద్వారం వరకు తీసుకొని వెళ్ళారు.

అయితే దారి మధ్యలోనే భక్తుడు కోలుకోలేక మరణించినాడని కైలాస ద్వారం దగ్గర వైద్యులు నిర్ధారించారు. మృతుడు వేద మూర్తి S/o. కట్టె గౌడ, బొమ్మనహల్లి గ్రామం, బళ్ళారి జిల్లా, కర్ణాటక రాష్ట్రం స్వగ్రామమని పోలీసులు నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు