Coconut Trees
cut down hundreds of coconut trees : విజయనగరం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పూసపాటిరేగ మండలం వెళ్దూరులో గుర్తు తెలియని దుండగులు కొబ్బరి తోటను ధ్వంసం చేశారు. సుమారు వంద కొబ్బరి చెట్లను నరికివేశారు. దీంతో వెళ్దూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వెళ్దూరు గ్రామానికి చెందిన దారుపు వెంకటయ్యరెడ్డికి చెందిన కొబ్బరి తోటను దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైసీపీ నాయకుల పనేనంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు దారుపు వెంకటయ్యరెడ్డి… పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు.
AP TS Water War: ప్రాజెక్టులను బోర్టుల పరిధిలోకి తేవడం సాధ్యమేనా..?
ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినట్టు గ్రామస్తులు చెపుతున్నారు. దీంతో ఆయనపై స్థానిక వైసీపీ నేతలు కక్షకట్టి ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చెట్లపై పగ తీర్చుకోవడమేంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.