ఏపీలో మతకల్లోలాలకు కుట్రపన్నుతున్నారు, అంతర్వేదిపై సిబిఐ విచారణకూ రెడీ

  • Publish Date - September 10, 2020 / 04:46 PM IST

Antarvedi radham: అంతర్వేది రథదగ్ధం ఆసరగా మతకల్లోలాలను రేపడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అంబటి రాాంబాబు. సమీపంలోని మరో మతప్రార్ధనామందిరం మీద రాళ్లేయడం సమంజసం కాదు, దాన్ని ఎవరూ అంగీకరించబోరని అన్నారు.లక్ష్మీనరసింహస్వామికూడా దీన్ని అంగీకరించడని అంబటి వ్యాఖ్యానించారు.




అలాగని ఈ దాడిని భక్తులు చేసిందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.భక్తుల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించి మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

అంతర్వేది రథదగ్ధం వెనుకున్న కారణాన్ని అన్వేషించడానికి విచారణ మొదలయింది. అయినా ఏదో ఒక విధంగా బురదజల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఎందుకు చేస్తున్నాయి? కారణం జగన్ ప్రభుత్వ సంక్షేమపథకాలను అమలుచేయడమేనని అంబటి అంటున్నారు.



వైఎస్సార్ ఆసరా రేపు ప్రారంభం కాబతోంది. ఒక్కటేంటి? చాలా పథకాల్లో డబ్బు నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లలోనే పడుతున్నాయి. ఈ పథకాలనుంచి దృష్టిని మరల్చడానికే ఇలా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
https://10tv.in/brazil-pregnant-woman-killed-when-friend-allegedly-lured-her-to-party-cut-out-unborn-baby/
ఏ దర్యాప్తుకైనా సిద్ధమే. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుందని అంబటి తేల్చేశారు.