ఎపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పదవికి పూనూరి గౌతంరెడ్డి రాజీనామా.. కారణ ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతంరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Gowtham Reddy

Punuru Gowtham Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌ పదవికి వైసీపీ నేత పూనూరి గౌతంరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో నా పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. గత పాలకుల వైఫల్యంతో ప్రతినెల ఫైబర్ గ్రిడ్ కు 15కోట్ల నష్టం వచ్చేది. వైసీపీ ప్రభుత్వం హయాంలో నేను బాధ్యతలు స్వీకరించిన తరువాత నష్టాలను నివారించానని చెప్పారు. సరసమైన ధరలకే నెట్ ను ప్రజానీకానికి అందించామని అన్నారు.

Also Read : ఎవరీ ఐశ్వర్య మీనన్..! మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించారో తెలుసా?

ఓటీటీ ప్లాట్ ఫాంను సిద్ధం చేశాం. ఫస్ట్ డే ఫస్ట్ సినిమా పేరుతో ఫైబర్ గ్రిడ్ లో లాంచ్ చేశామని గౌతంరెడ్డి చెప్పారు. రాబోయే ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఫైబర్ నెట్ లో తీసుకున్న నిర్ణయాలకు జగన్ అన్ని విధాలా సహకరించారు. గతంలో ఎండీ ఇచ్చిన పిర్యాదుపై విచారణ జరుగుతుంది. గవర్నర్ ఆదేశాలతో పోలీసులు ఎపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయం వద్ద బందోబస్తు ఉన్నారని అనుకుంటున్నా. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. ప్రతీకార చర్యగా వైసీపీ ఉంటుందని అనుకోవడం లేదని గౌతంరెడ్డి అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు