Posani Krishna Murali (Photo : Google)
Posani Krishna Murali – Pawan Kalyan : సినీ నటుడు పోసాని కృష్ణమురళి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. పవన్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. చంద్రబాబును అభిమానిస్తున్న పవన్ గొప్ప వాడా? ముద్రగడ పద్మనాభం గొప్పవాడా? అని పోసాని నిలదీశారు. చంద్రబాబు స్కెచ్ ప్రకారమే పవన్ మాట్లాడుతున్నారని పోసాని విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు అని ధ్వజమెత్తారు.
పవన్ వల్లే కాపులు తిట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు అని ఆయన వాపోయారు. సినిమా ఆర్టిస్ట్ అనే పవన్ ను చూడటానికి ప్రజలు ఆయన సభలకు వస్తున్నారు అని చెప్పారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ కన్నా గొప్ప నాయకుడు అని పోసాని వ్యాఖ్యానించారు.
” పవన్ కల్యాణ్.. నా తల్లి సాక్షిగా చెబుతున్నా. ముద్రగడ పద్మనాభంలో ఇసుమంతైనా అసూయ లేదు, అవినీతి లేదు. పాలిటిక్స్ లో కానీ మరెక్కడైనా కానీ చూసుకో. ఆయన క్రిస్టల్ క్లియర్ జెంటిల్ మెన్. నువ్వు బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ.. ఎవరినైనా అడుగు. ముద్రగడ లంచం తీసుకున్నాడు అంటే నేను వచ్చి నీ కాళ్లకు దండం పెడతా. నా మాట్లన్నీ వెనక్కి తీసుకుంటా. అలాంటి మహానాభావులు కాపు నాయకుల్లో చాలా మంది ఉన్నారు వారు వేరే వాళ్ల పార్టీలో ఉండొచ్చు.
పవన్ గురించి నీ నేను చాలా ఊహించుకున్నా. ఎందుకంటే నువ్వు నా సాటి ఆర్టిస్ట్ వి. మీ అన్నయ్య అంటే నాకు బాగా ఇష్టం. నేను అన్నా మీ అన్నయ్యకు ఇష్టమే. ఇదంతా నువ్వు రాజకీయాల్లోకి రాకముందు. వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడని ఆంధ్రా మొత్తం తెలుసు కదా? మరి చంద్రబాబుని ఎలా భరిస్తున్నావు? ఏమైనా పర్లేదు మా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటావా? అలా అనకయ్య సామీ. నీ కాళ్లకు దండం పెడతా. మా కమ్మ వాడు మాకు సీఎం కావాలని మేము ఫీల్ అవుతున్నావు. నువ్వు ఎందుకు అలా కోరుకోవడం లేదు. ఇదేం రాజకీయం అయ్యా పవన్ కల్యాణ్. పవన్ పక్కనున్న అందరికి చెబుతున్నా. మీలో మీరు తిట్టుకోవద్దు, తన్నుకోవద్దు. ఇది చంద్రబాబు రాజకీయం అని గ్రహించండి. జాగ్రత్తపడండి. మీరు ముక్కలైపోతే ఓట్లు కూడా ముక్కలైపోతాయి.
ముద్రగడ లంచం తీసుకున్నట్లు పవన్ నిరూపించాలి. పవన్ కన్నా ముద్రగడ గొప్ప లీడర్. పవన్ ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయండి. మేము ఓట్లు వేస్తాం అని ధైర్యం చెప్పండి అతడికి. పవన్ ఏం చేస్తున్నాడో అతడికే తెలియడం లేదు. ఈ రోజుల్లో చంద్రబాబును సపోర్ట్ చేయడం ఏంటయ్యా? చంద్రబాబు ఎన్ని మోసాలు, దారుణాలు చేశాడో తెలియదా?” అని పోసాని కృష్ణమురళి అన్నారు.