Ap Prc
PRC Controversy In AP : ఏపీ రాష్ట్రంలో సర్కార్ వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయింది. పీఆర్సీ వివాదం ఇరువురి మధ్య చిచ్చు రేపింది. పీఆర్సీపై సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వెంటనే జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని అల్టిమేటం జారీ చేసింది. ఇదిలా ఉంటే..హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. 2022, జనవరి 24వ తేదీ సోమవారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టీరింగ్ కమిటీలో ఉన్న 12 మంది సభ్యులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాకుండా..పిటిషనర్ కూడా హాజరు కావాలని వెల్లడించింది. విచారణ మధ్యాహ్నం 2.15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
Read More : Tirumala Visit: కోవిడ్ వాక్సినేషన్/నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతి
కొత్త పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఏపీ సీఎస్‌కు సమ్మె నోటీ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది పీఆర్సీ స్టీరింగ్ కమిటీ. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. ఇదిలా కొనసాగుతుండగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు…11వ పీఆర్సీ వివాదంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయనుంది ఏపీ ప్రభుత్వం. నూతన పీఆర్సీతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగట్లేదని వాదన బలంగా వినిపించనుంది. ఇందుకు గ్రామ, వార్డు వాలంటీర్లను ఎంచుకుంది. ఒక్కో వాలంటీర్..తమ పరిధిలోని 50 కుటుంబాలకు ఈ పోస్టర్లను పంచనున్నారు.