చిత్తూరుకు రాష్ట్రపతి

ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్‌లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలలో రాష్ట్రపతి కోవింద్‌కు.. ఏపీ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం జగన్ లు స్వాగతం పలుకుతారు. అనంతరం మదనపల్లె నుంచి రోడ్డు మార్గనా..సత్సంగ్ ఆశ్రమానికి చేరుకుంటారు రాష్ట్రపతి. ఆశ్రమంలో జరిగే శంకుస్థాపన, భారత్‌ యోగా విద్యా కేంద్ర ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వస్థ్య ఆసుపత్రికి రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారు.

సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు. విద్యార్థులు, టీచర్లతో రాష్ట్రపతి మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్ లో బెంగళూరుకు పయనం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.