సుజనా ఆర్థిక నేరాలు..స్కామ్‌లు : విజయసాయి లేఖ..స్పందించిన రాష్ట్రపతి

  • Publish Date - December 24, 2019 / 12:48 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్‌లపై విచారణ జరపాలని గతంలో రాష్ట్రపతికి విజయసాయి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన లేఖలో కోరారు. విజయసాయి రాసిన లేఖను 2019, డిసెంబర్ 24వ తేదీ హోం శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి పంపారు. రాష్ట్రపతి స్పందించడంతో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందనేది ఉత్కంఠగా మారింది. టీడీపీలో ఉన్న సుజనా చౌదరి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

* ఇటీవలే సుజనా నివాసంలో, కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. రుణాల ఎగవేత, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు తదితర అంశాలపై కేసులు నమోదయ్యాయి. 
* సుజనాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
* బ్యాంకుల నుంచి రుణాలు పొంది మోసం చేశారని ఆరోపణలు.
 

* విచారణకు హాజరు కావాలని ఆదేశం.
* మొత్తం విలువ రూ. 5 వేల 700 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రచారం జరిగింది. 
* తాజాగా రాష్ట్రపతి స్పందనతో సుజనా చౌదరి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 
Read More : 

ట్రెండింగ్ వార్తలు