DIG Ravi Kiran : బరువు తగ్గలేదు, ఆసుపత్రికి పంపలేము, మాకు ఖైదీలంతా సమానమే- చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ళ శాఖ డీఐజీ

2039 ఖైదీల్లో చంద్రబాబు ఒకరు. రిమాండ్ ప్రిజనర్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రతలు తీసుకుంటున్నాము. DIG Ravi Kiran

Ravi Kiran On Chandrababu Health

Ravi Kiran On Chandrababu Health : జైల్లో చంద్రబాబు ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై జైళ్ళ శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. భద్రత విషయంలో జైల్లో చంద్రబాబుకి ఎటువంటి ముప్పు లేదని తెలిపారు. చంద్రబాబుకి జైల్లో పూర్తి స్థాయిలో వైద్య సాయం అందుతోందని వెల్లడించారు. ఇక, చంద్రబాబు బరువు తగ్గారు అనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. అందులో నిజం లేదన్నారు. చంద్రబాబు బరువు తగ్గలేదు పెరిగారు అని చెప్పారు. చంద్రబాబు జైలుకి వచ్చేసరికి ఆయన బరువు 66కిలోలుగా ఉందని, అనంతరం 68 కిలోలకి పెరిగిందని, ప్రస్తుతం ఆయన బరువు 67 కిలోలుగా ఉందని వివరించారు.

చంద్రబాబు మాకు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమే:
”చంద్రబాబు ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జైల్లో వైద్యం చేశాం. అయితే సెకండ్ ఒపీనియన్ కోసం జీజీహెచ్ డాక్టర్లను సంప్రదించాం. చంద్రబాబు రెగులర్ గా వాడే మందులే వాడుతున్నారు. జైలుకు వచ్చిన తర్వాత మందులు మారలేదు. చంద్రబాబు మాకు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమే. కలుషిత నీరు అనేది వాస్తవం కాదు. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రతి నిమిషం సీసీటీవీలో రికార్డ్ అవుతోంది. చంద్రబాబుకి రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నాం. హై ప్రొఫైల్ కాబట్టి సెపరేట్ బ్యారక్ ఏర్పాటు చేయడం జరిగింది.

Also Read : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు

నిత్యం డాక్టర్స్ చెక్ చేస్తున్నారు..
చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో బయట ఎవరూ ఉండరు. ఆయన విషయంలో భద్రత తీసుకున్నాం. అడ్మిట్ అయిన రోజు నుండి మెడిసిన్స్ సరిగా వేసుకుంటూన్నారా లేదా అని డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. మధ్యలో డీహైడ్రేషన్ అయినప్పుడు ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ ఇచ్చాము. చంద్రబాబు తెచ్చుకున్న మెడిసిన్స్ మాత్రమే ఆయన వాడుతున్నారు. ర్యాషస్ వల్ల కొన్ని క్రీమ్స్ ఇచ్చాము. 2039 ఖైదీల్లో చంద్రబాబు ఒకరు. రిమాండ్ ప్రిజనర్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రతలు తీసుకుంటున్నాము.

కఠిన చర్యలు తప్పవు..
జైలులో చంద్రబాబు ప్రతి మూమెంట్ సీసీ కెమెరాల్లో ఉంది. ఫుడ్ నుండి ములాఖత్ వరకు కెమెరాలో ఉంటుంది. చంద్రబాబు కోరిక మేరకు ఆసుపత్రికి పంపించలేము. ఇక్కడ ఖైదీలందరూ ఒక్కటే. చంద్రబాబు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని డీఐజీ రవికిరణ్ హెచ్చరించారు.

Also Read : చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు