Kadapa: కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు.. కారణం ఏమిటంటే..
కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌తోపాటు ముగ్గురు జైలు వార్డెన్లు ఉన్నారు.
- Harishth Thanniru
- Published On : July 22, 2025 / 10:16 AM IST
kadapa central jail
Kadapa: కడప సెంట్రల్ జైల్లో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. సెంట్రల్ జైల్లో ఎర్రచందనం స్మగ్లర్లకు జైలు సిబ్బంది తరచుగా మొబైల్ ఫోన్లు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా కడప జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేశారు. విచారణ అనంతరం రవికిరణ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐదుగురిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ రావుతోపాటు మరో ముగ్గురు జైలు వార్డెన్లను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
