Privilege committee notices : ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు పంపారు.
- bheemraj
- Published On : March 18, 2021 / 04:15 PM IST
Privilege Committee Notices Issued To Ap Sec Nimmagadda Ramesh Kumar1
Privilege committee notices to SEC Nimmagadda : ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎస్ఈసీ నిమ్మగడ్డకు నోటీసులు పంపారు. ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. మంత్రులు బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిమ్మగడ్డ గవర్నర్ కు చేసిన వ్యాఖ్యలపై నోటీసులు పంపారు. ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో సెలవులపై వెళ్లేందుకు నిమ్మగడ్డకు ఆటకం ఏర్పడింది.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై నిన్న ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. గతంలో నిమ్మగడ్డ వ్యవహారంపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఒకసారి సమావేశం జరిగింది. ప్రాథమికంగా ఫిర్యాదును స్వీకరించిన ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. అయితే నిన్న మరోసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది.
తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, అలాగే తమ హక్కులకు భంగం కల్గించే విధంగా అనేక ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు లేఖ రాయడాన్ని తప్పుబడుతూ మంత్రలు బొత్స, పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
