ఐలవల, బల్లవలల వాడకంపై నిషేధం..మత్స్యకారుల గొడవపై మత్స్యశాఖ కీలక నిర్ణయం

ఐలవల, బల్లవలల వాడకంపై నిషేధం..మత్స్యకారుల గొడవపై మత్స్యశాఖ కీలక నిర్ణయం

Updated On : December 29, 2020 / 10:18 AM IST

Prohibition on the use of ailavala, ballavala : ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల, బల్లవలలపై ఇండియన్ ఫిషరీయాక్ట్ 145 సెక్షన్ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని.. ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

బల్లవల వాడకం వల్ల చిన్న చేపలు మరణిస్తున్నాయని.. 44 గ్రామాలు అభ్యంతరాలు తెలిపారని.. మరోవైపు ఐలవలపై వాడరేవు వాసుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. రెండు వలలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు మత్స్యశాఖ అధికారులు. ఐలవలపై నిషేధంపై కఠారిపాలెం మత్స్యకారుల అభ్యంతరం తెలిపారు. ఐలవలతో చిన్న చేపలకు ప్రమాదం లేదంటున్న మత్స్యకారులు

వలల కారణంగా ఇరు వర్గాల మత్స్యకారుల మధ్య తీవ్ర విభేధాలు తలెత్తాయి. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో 20 రోజుల క్రితమే బల్లవల, ఐలవలలపై అధికారులు నిషేధం విధించారు. దీంతో మత్స్యకారులు వేటను నిలిపివేశారు. ఇప్పుడు నిషేధంపై అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.