పోసానిగారు.. రోజాని అనే ధైర్యం ఉందా

రాజధాని విషయంలో పెయిడ్ ఆర్టిస్టుల అంశంపై నటుడు పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు

  • Publish Date - January 11, 2020 / 05:37 AM IST

రాజధాని విషయంలో పెయిడ్ ఆర్టిస్టుల అంశంపై నటుడు పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు

రాజధాని విషయంలో పెయిడ్ ఆర్టిస్టుల అంశంపై నటుడు పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు రైతులకు క్షమాపణ చెప్పాలంటూ పోసాని చేసిన విమర్శలకు పృథ్వీ ఘాటుగా బదులిచ్చారు. పోసానికి బుద్ది లేదు కాబట్ట తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్లు కామెంట్ చేశారని గుర్తు చేసిన పృథ్వీ.. వాళ్లపై మాట్లాడే దమ్ము పోసానికి ఉందా అని నిలదీశారు. నేను రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదన్నారు. రైతుల ముసుగులోని బినామీలను మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అన్నాను అని చెప్పారు. రాజధానిలో ధర్నా చేస్తున్న వారిలో నాతో పని చేసిన ఆర్టిస్టులు ఉన్నారని పృథ్వీ వెల్లడించారు.

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ పృథ్వీ అనడం వివాదానికి దారితీసింది. దీనిపై పోసాని కృష్ణ మురళి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కడుపు మండి ఆందోళనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడాన్ని తప్పుపట్టారు. రైతులను కించపరుస్తావా అంటూ పృథ్వీపై విరుచుకుపడ్డారు. ఒక సామాజికవర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడం ఏంటని నిప్పులు చెరిగారు. పోసాని వ్యాఖ్యలను పృథ్వీ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు.

అధికార పార్టీలో సినీ నటుల మధ్య జరుగుతున్న కయ్యం చర్చనీయాంశంగా మారింది. పోసాని కామెంట్స్ రాజధాని రగడలో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు పోసాని నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

పోసానిపై పృథ్వీరాజ్ కామెంట్స్:
* మంచి మాట్లాడినా పార్టీ భ్రష్టుపట్టిపోతుందని పోసాని ఏ రకంగా స్క్రిప్ట్ రాసుకుని చెప్పారో తెలియదు
* వైసీపీలో క్రియాశీలక సభ్యుడిగా 11ఏళ్లుగా పని చేస్తున్నా
* మాటకి ముందు వెనుక ఎస్వీబీసీ చైర్మన్ పదవి గురించి ప్రస్తావిస్తున్నారు
* పదవి ఇక్కడ క్రైటీరియా కాదు.. పదవులు శాశ్వతం కాదు
* పార్టీ అనేది శాశ్వతం.. మంచి చేస్తే పార్టీకి, నాయకుడికి ప్రజలు బ్రహ్మరథం పడతారు
* రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు
* ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు
* చంద్రబాబు, లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు బినామీలు అమరావతిలో వేల ఎవరాల భూములు కొన్నారు
* ఆ బినామీ రైతులు పెయిడ్ ఆర్టిస్టులు

* నేనూ రైతు కుటుంబం నుంచే వచ్చా
* నేను పొలం దున్నుత్తా
* పెయిడ్ ఆర్టిస్టులు వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
* ఆందోళనలో పాల్గొన్నవారిలో కొందరు నాతో కలిసి ఆర్టిస్టులుగా పని చేశారు
* రైతులకు అన్యాయం జరక్కూడదు అనేది ప్రభుత్వం లక్ష్యం
* అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వం ఉద్దేశ్యం
* హైదరాబాద్ విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు
* సామాజికవర్గాన్ని కించపరిచే నీచానికి దిగజారలేదు
* ఒకే పార్టీలో ఉంటూ నన్ను అనడం కరెక్టేనా.. పోసానికి బుద్దుందా..?

* కార్పొరేట్ ముసుగులో ఆడి కార్లలో వచ్చే వారు రైతులు కాదు
* కార్యకర్తల్లో ఊపు తీసుకురావడం కోసమే నాకు పదవిచ్చారు
* సినిమా రంగం నుంచి చిరంజీవి తప్ప ఎవరూ నన్ను విష్ చెయ్యలేదు
* కడుపు మంటతో పార్టీపై బురద చల్లడం కరెక్ట్ కాదు

Also Read : రైతులకు ఆడి కార్లు ఉండకూడదా? బంగారు గాజులు కొనుక్కోకూడదా? పోసాని వర్సెస్ పృథ్వీ