Vijayawada Psycho
Vijayawada Psycho : అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.
ఎవరో పరిచయం లేని వ్యక్తి వేళ కాని వేళలో చిమ్మచీకట్లో వారి ఎదురుగా ఉంటాడు. ఊహించడానికే భయం కలిగించే ఈ ఘటన విజయవాడ అయ్యప్పనగర్ లో తరుచుగా జరుగుతోంది. ఓ సైకో విపరీత ప్రవర్తన, వికృత చర్యలు, వెకిలి చేష్టలతో స్థానిక మహిళలు రాత్రి అయ్యిందంటే చాలు భయంతో వణికిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సైకో తీరుతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని మహిళలు అంటున్నారు. సైకోని పోలీసులు పట్టుకునే దాకా తమకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైకోని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నామని, మూడు బృందాలు ఏర్పాటు చేశామని, మహిళలు భయపడొద్దని పోలీసులు చెప్పారు.