Water Dispute : జల జగడం.. కేంద్ర మంత్రికి రఘురామకృష్ణరాజు లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.

Water Dispute : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సోమవారం ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ కట్టడమని ఫిర్యాదులో పేర్కొంది.

ఇక ఇదే అంశంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలన్నారు. ఇద్దరు శత్రువుల మధ్య వివాద పరిష్కారం సులువుగా చేయొచని, రెండు రాష్ట్రాల సీఎంలు మంచి మిత్రులు, వారి మధ్య వివాద పరిష్కారం అంత సులువు కాదన్నారు.

వివాదం ముదిరి శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్, విద్యుత్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనీ కోరారు. నీరు, విద్యుత్ పంపిణీ బాధ్యతలు కేంద్రం తీసుకోవాలన్నారు. కాగా ప్రస్తుతం శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు