ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆయలంలోనికి ప్రవేశించిన రాహుల్ కి టీటీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో రాహుల్ ని సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి, ఉమెన్ చాందీ, టి.సుబ్బిరామిరెడ్డి, తదితరులు ఉన్నారు.
అంతకుముందు గంట యాభై నిమిషాల్లోనే కాలినడకన తిరుమల చేరుకొని అతి తక్కువ సమయంలో కాలినడక మార్గంలో తిరుమల చేరుకొన్న మొదటి రాజకీయనాయకుడిగా రాహుల్ రికార్డ్ సృష్టించారు.