Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. ఏపీలో సెగలు.. తెలంగాణలో జల్లులు.. వాతావరణ శాఖ అలర్ట్!

రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భిన్నమైన వాతావరణ (Rain Alert)పరిస్థితులు నెలకొననున్నాయని వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

Andhra pradesh and telangana weather report for coming three days

  • తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు
  • ఏపీలో పెరగనున్న వేడిగాలుల తీవ్రత
  • తెలంగాణలో కురవనున్న తేలికపాటి జల్లులు

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో (జూలై 13 నుండి జూలై 15 వరకు) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరగనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.

Voter ID registration: కొత్త ఓటర్లకు అలర్ట్.. ఇకనుంచి ఈ వివరాలు తప్పనిసరి.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ (Rain Alert)కేంద్రం తెలిపింది. అయితే తీరప్రాంత జిల్లాల్లో సాధారణం కంటే 5°C వరకు ఉష్ణోగ్రతలు పెరిగి, తీవ్రమైన వేడిగాలులు (Heat waves) వీచే ముప్పు ఉందని హెచ్చరించింది. మరోవైపు రాయలసీమలో ఎండలతో పాటు గంటకు 30-50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఇక తెలంగాణలో రుతుపవనాల బ్రేక్ కారణంగా ‘మినీ సమ్మర్’ వాతావరణం ఉన్నప్పటికీ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలుల పట్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.