Thalliki Vandanam : తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు అలర్ట్.. ఈ పొరపాటు ఎవ్వరూ చేయొద్దు.. ఇవి తప్పనిసరి
Talliki Vandanam Scheme : ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Talliki Vandanam Scheme
Talliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 15వ తేదీన మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) నిర్వహించే సమయంలోనే తల్లికి వందనం డబ్బులను కూడా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెలలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం నిధులు జమ కానున్నాయి.. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లుసైతం చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan Health Update : పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు..
తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ సొమ్మును విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. రూ.15వేలలో రూ.13వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్న ప్రభుత్వం.. మిగిలిన రూ.2వేలు పాఠశాల నిర్వహణ నిధి (మెయింటెనెన్స్ ఫండ్) ఖాతాకు బదిలీ చేస్తుంది. మరో వారం పదిరోజుల్లో తల్లికివందనం పథకం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే, డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.
ఇవి తప్పనిసరి..
♦ విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి.
♦ ఎన్పీసీఐ (NPCI – National Payments Corporation of India) మ్యాపింగ్ కూడా పూర్తయ్యి ఉండాలి.
♦ లబ్ధిదారులు తమ సంబంధిత బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ (e-KYC) వివరాలను కూడా అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి.
♦ ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేస్తేనే అకౌంట్లో నగదు డీబీటీ ప్రక్రియ ద్వారా జమ అవుతాయి. ఒకవేళ చేసుకోకపోతే డబ్బులు నిలిచిపోతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
♦ లోపాలు లేని బ్యాంక్ ఖాతాలు ఉన్న వారికే నేరుగా నగదు బదిలీ అవుతుంది.
♦ అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు ముందే తమ బ్యాంక్ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోవాలి..
♦ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
♦ అక్కడ Application Status ఐకాన్‌పై క్లిక్ చేయాలి. మరో విండో ఓపెన్ అవుతుంది.
♦ స్కీమ్ ఇయర్, ఆధార్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
♦ స్కీమ్ దగ్గర తల్లికి వందనంను ఎంచుకోవాలి. ఇయర్ వద్ద 2026-27ను ఎంపిక చేసుకోవాలి. సెర్చ్ బై అనే దగ్గర ఎవరి డేటాతో (తల్లి/ తండ్రి/ విద్యార్థి/ గార్డియన్) అయితే చెక్ చేయాలని అనుకుంటున్నారో వారిని సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలక్ట్ చే సుకున్నవారి ఆధార్ కార్డు నంబర్‌ను పక్కన ఉన్న ఆధార్ బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
♦ ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద కనిపించే క్యాప్చా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంది.
♦ ఆ తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసి డేటాను సబ్మిట్ చేయాలి. అప్పుడు తల్లివందనం అప్లికేషన్ స్టేటస్ స్థితి తెలుస్తోంది.
