TG Police Recruitment 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్.. దరఖాస్తు తేదీలు ఇవే
TG Police Recruitment 2026 : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
TG Police Recruitment 2026
TG Police Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ శాఖ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక (ఫైర్) శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ తదితర వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఒకేసారి వేల సంఖ్యలో పోలీసు శాఖక చెందిన ఉద్యోగాల భర్తీ చేపట్టడం నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
