TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శన టికెట్లు, గదుల కోటా వివరాలు విడుదల
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది.
TTD release darshan tickets and room quotes details for October month
- అక్టోబర్ శ్రీవారి దర్శన కోటా
- ఆర్జిత సేవలకు లక్కీ డిప్
- ఆన్లైన్లో గదుల బుకింగ్ లభ్యం
TTD: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శనాలు, సేవా టికెట్లు, వసతి గదుల ఆన్లైన్ కోటా విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించింది.
Chandrababu Met Pawan: పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ.. ముంబయి వెళ్లి కలిసిన సీఎం చంద్రబాబు
ఆర్జిత సేవలు – లక్కీ డిప్ వివరాలు:
* జూలై 18 (ఉదయం 10 గంటలకు): సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. భక్తులు జూలై 20 ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు జూలై 22 మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
* జూలై 21 (ఉదయం 10 గంటలకు): కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదలవుతాయి.
* జూలై 21 (మధ్యాహ్నం 3 గంటలకు): వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటా అందుబాటులోకి వస్తుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం – గదుల కోటా:
* జూలై 23: ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి.
* జూలై 24: ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలోని వసతి గదుల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
