వెదర్ అప్‌డేట్ : కోస్తా, సీమలకు వర్ష సూచన

వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది.

  • Publish Date - January 22, 2019 / 06:37 AM IST

వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది.

వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది. 2019, జనవరి 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధిక పీడనంతో వీస్తున్న చలిగాలులతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలికి తోడు పొగమంచు కూడా ఉక్కిబిక్కిరి చేస్తోంది. పొగమంచు కారణంగా కోస్తాలో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది.

 

* చింతపల్లిలో 8.5 డిగ్రీలు
* ఆరోగ్యవరంలో 13 డిగ్రీలు
* అనంతపురంలో 15 డిగ్రీలు
* విశాఖలో 15 డిగ్రీలు

ట్రెండింగ్ వార్తలు