Rain (Image Credit To Original Source)
AP Weather: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ చిత్తూరుతో పాటు తిరుపతి, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో చల్లని గాలులు వీస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పంటలు కోత దశలో ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. మరోవైపు, కొన్ని రోజులుగా ఏపీలో రాత్రుళ్లు చలి అధికంగా ఉంటోంది. పగటిపూటేమో ఎండలు కొడుతున్నాయి.
Also Read: వెనెజువెలా అధ్యక్షుడిని నేనే.. తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
కాగా, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌గా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని చెప్పింది.