అజ్ఞాతం నుంచి బయటకు: మాజీ ఎంపీ హర్షకుమార్‌ అరెస్ట్

  • Publish Date - December 13, 2019 / 03:28 PM IST

అమలాపురం మాజీ ఎంపీ, దళిత నాయకులు హర్షకుమార్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో హర్షకుమార్‌ని పోలీసలు అరెస్ట్ చేశారు. హర్షకుమార్‌పై 353, 323, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

డాక్టర్ల చేత పరిక్షలు చేయించిన అనంతరం హర్షకుమార్‌ని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. నాన్ బెయిలబుల్ కేసులతో హర్షకుమార్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. 76 రోజుల తర్వాత ఆయన అజ్ఞాతం వీడి రాజమండ్రికి వచ్చారు.

ఈ క్రమంలో రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై హర్షకుమార్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.